పెళ్లి చేసుకున్న ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు..!

ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు నాట్ స్కివర్, కేథరిన్ బ్రంట్ వివాహం చేసుకున్నారు. 2017 వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో సీవర్, కేథరిన్ సభ్యులు. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ లో రన్నపర్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు ఈ ఇద్దరు ప్రాతినిథ్యం వహించారు. 

2017-18లోనే వీరు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ప్రకటించారు. 2019 అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2020 సెప్టెంబర్ లోనే వీరు పెళ్లి చేసుకోవాలని అనుుకున్నారు. కానీ కరోనా కారణంగా అది చేసుకోలేకపోయారు. తాజాగా కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు.

ప్రస్తుతం సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది కామన్ అయిపోయింది. అయితే క్రికెటర్లలో పెళ్లి చేసుకున్న మొదటి మహిళల జంట వీరే.. త్వరలో న్యూజిలాండ్ కి చెందిన అమీ సట్టర్థ్ వైట్- లీ టహుహు, దక్షణిఫ్రికాకు చెందిన మరిజ్నే కప్- డేన్ వాన్ నీకెర్క్, ఆస్ట్రేలియాకు చెందిన ఒక జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.  

 

 

 

View this post on Instagram

 

A post shared by Natalie Sciver (@natsciver)

Leave a Comment