2021-22 జగనన్న ‘సంక్షేమ క్యాలెండర్’ విడుదల

2021-22 సంవత్సరానికి గానూ జగనన్న సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేస్తున్నట్లు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఏ నెలలో ఏ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందో ప్రజలు తెలియజేస్తున్నామన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలపై ఎలాంటి సందేహాలు లేకుండా ఉండేందుకు క్యాలెండర్ విడుదల చేశామన్నారు. ఈ మేరకు సంక్షేమ పథకాల క్యాలెండర్ వివరాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 

ఏప్రిల్ నెలలో..

 • జగనన్న వసతి దీవెన మొదటి విడత.
 • జగనన్న విద్యా దీవెన మొదటి విడత.
 • 2019 రబీకి రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు.
 • డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపులు

మేలో..

 • 2020 ఖరీఫ్ కు సంబంధించిన పంటల బీమా చెల్లింపులు
 • వైఎస్సార్ రైతు భరోసా పథకం
 • వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే మత్స్యకార భరోసా పథకం, డీజిల్ సబ్సిడీ కూడా అమలు.

జూన్ లో..

 • వైఎస్సార్ చేయూత పథకం.(బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు రూ.15 వేల సాయం)
 • జగనన్న విద్యా కానుక.

జూలైలో..

 • జగనన్న విద్యా దీవెన రెండో విడత.
 • వైఎస్సార్ కాపు నేస్తం
 • వైఎస్సార్ వాహన మిత్ర

ఆగస్టులో..

 • రైతులకు 2020 సంవత్సరానికి గానూ ఖరీఫ్ కు సున్నావడ్డీ చెల్లింపు.
 • మధ్య తరహా పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక ప్రోత్సాహకం.
 • వైఎస్సార్ నేతన్న నేస్తం
 • అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు

సెప్టెంబర్ లో..

 • వైఎస్సార్ ఆసరా

అక్టోబర్ లో..

 • రైతు భరోసా రెండో విడత
 • జగనన్న చేదోడు
 • జగనన్న తోడు

నవంబర్ లో..

 • అగ్రవర్ణాల్లో బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, రెడ్డి వెలమ, క్షత్రియ, ముస్లింలలో ఆర్థిక వెనుకబాటు ఉన్న మహిళలకు ఈబీసీ నేస్తం పథకం అమలు..

డిసెంబర్ లో..

 • జగనన్న వసతి దీవెన రెండో విడత
 • జగనన్న విద్యా దీవెన మూడో విడత
 • వైఎస్సార్ లా నేస్తం

జనవరి 2022లో..

 • రైతు భరోసా మూడో విడత
 • జగనన్న అమ్మఒడి
 • వైఎస్సార్ ఆసర పెన్షన్ పెంపు(రూ.2250 నుంచి రూ.2500)

ఫిబ్రవరి 2022లో..

 • జగనన్న విద్యా దీవెన నాలుగో విడత.

 

Leave a Comment