అది వైఎస్సార్ చేయూత కాదు..జగన్ రెడ్డి చేతివాటం : నారా లోకేష్

టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మహిళల కోసం ప్రారంభించిన వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించి విమర్శలు చేశారు. ‘అది వైఎస్సార్ చేయూత కాదు జగన్ రెడ్డి చేతి వాటం. 45 ఏళ్లకు పెన్షన్ ఇస్తే ఏడాదికి రూ.36,000 ఇవ్వాలి. 5 ఏళ్ళలో రూ.1.80 లక్షలు ఇవ్వాలి. అందుకే జగన్ రివర్స్ టెండరింగ్ పెట్టారు.’ అంటూ ట్విట్ చేశారు. 

ఇక మరో ట్వీట్ లో ‘5 ఏళ్ల పాలనలో ఒక్కో బిసి, ఎస్సి, ఎస్టీ మహిళకు కేవలం రూ.75,000 ఇస్తామనిచెప్పి, ఒక లక్షా ఐదు వేల నష్టం చేసారు. ప్రతి ఏటా నష్టం రూ.17,250/-, 4 ఏళ్ళలో రూ.69,000. మొదటి ఏడాది ఎగనామం రూ.36000. మొత్తంగా ఒక్కో మహిళకు జగన్ రెడ్డి చేతివాటం, లక్షా ఐదువేల రూపాయిలు.’ అంటూ విమర్శించారు. 

‘మేము కోటి మందికి  పసుపు కుంకుమ ఇచ్చాము. మీరేమో లబ్దిదారులను 23 లక్షలకు తగ్గించి వారిలో విభేదాలు సృష్టిస్తున్నారు. మిగిలిన వారు పేదలు కాదా? చాలా మంది పేద మహిళలకు ఆధార్ లో వయస్సు తప్పుగా నమోదు అయ్యింది. వారు నిరక్షరాస్యులు. వారికి మార్చుకొనే అవకాశమిచ్చి న్యాయం చెయ్యండి.’ అని ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

 

Leave a Comment