బాబాయ్ ని ఎవరు చంపారు? చెప్పు అబ్బాయ్ : నారా లోకేష్

సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘అంతా అడిగినట్లే.. నేనూ వివేకానందారెడ్డి హత్య కేసు గురించి అడుగుతున్నాను జగన్ రెడ్డీ.. బాబాయ్ ని ఎవరు చంపారు?.. చెప్పు అబ్బాయ్.. మీ చిన నాయనని మా నాయన నరికేశాడన్నావు.. సీబీఐ దర్యాప్తు చేయాలన్నావు.. ఇప్పుడెందుకు సీబీఐని వద్దంటున్నావు.. సమాధానం చెప్పు సైకోరెడ్డి.. వివేకా హత్య కేసు విచారణకు సీబీఐ వస్తే చాలు.. ఢిల్లీని గడగడలాడిస్తానన్న జగన్ గజగజా వణుకుతున్నాడు’ అంటూ ట్వీట్ చేశారు. 

పార్లమెంట్ లో లేవనెత్తుతా : ఎంపీ రాఘురామకృష్ణరాజు

ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎంపీ రాఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను గొడ్డలి పోటు పొడిచింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆయన హత్యకు గురైన తర్వాత కట్లు కట్టింది ఎవరని, ఆ వైద్యులు ఎవరో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివేకా హత్య వెనుక ఆయన బంధువులే ఉన్నారనే విషయం అర్థమవుతోందిని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో వివేకా హత్య అంశాన్ని లేవనెత్తుతానని అన్నారు. 

Leave a Comment