అతడు క్రికెటర్ కాకుంటే టెర్రిరిస్ట్ అయ్యేవాడు.. తస్లీమా నస్రీన్ వివాదస్పద వ్యాఖ్యలు..!

బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇంగ్లండ్ ఆల్ రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మొయిన్ అలీపై ట్విట్టర్ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ‘మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడు’ అని కామెంట్ చేసింది. దీంతో తస్లీమా నస్రీన్ పై యావత్ క్రికెట్ లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

 క్రికెటర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదని మండిపడుతోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే ట్విట్టర్ వేదికగా ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ముస్లిం అయినంత మాత్రాన అతను టెర్రరిస్ట్ అవుతాడా? అంటూ ప్రశ్రిస్తున్నారు. తనకు నచ్చింది తాను చేస్తున్నాడని, ఇతరులకు ఇబ్బంది కలిగించడం లేదని నిలదీస్తున్నారు. అతను ముస్లిం కావడంతోనే విద్వేశాన్ని చాటుకుంటున్నావని మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Comment