గుట్కా గుట్టు విప్పాడని.. యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ని హత్య చేసిన కానిస్టేబుల్..!

తమ అక్రమాలు వెలికితీస్తున్నాడని కక్షకట్టిన ఓ గుట్కా మాఫియా ఓ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టును అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఆ ముఠా సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలకు సాక్ష్యాలత సహా టీవీలో ప్రసారం చేయించడమే అతడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. 

నంద్యాలలో కొందరు మాఫియాగా ఏర్పడి గుట్కా విక్రయాలు చేస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. తమ చీకటి వ్యాపారానికి ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వరాదని ప్రతినెలా పోలీసులకు లక్షల్లో ముడుపులుు ముట్టచెబుతున్నారు. కాగా, ఈ దందాను నంద్యాలకు చెందిన యూట్యూబ్ ఛానల్ వీ5 రిపోర్టర్ కేశవ్ వెలుగులోకి తెచ్చాడు. 

కాగా, గుట్కా మాఫియాతో నంద్యాలకు చెందిన రెండవ పట్టణ కానిస్టేబుల్ సంబంధాలు ఉన్న వీడియోలు ప్రసారం చేశాడు. వీటిపై స్పందించిన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి.. నాలుగు రోజుల క్రితం కానిస్టేబు్ వెంకట సుబ్బయ్యను సస్పెండ్ చేశారు. కేశవ్ ప్రసారం చేసిన వీడియో ఆధారంగానే తనను ఎస్పీ సస్పెండ్ చేశారని కానిస్టేబుల్ కేశవ్ పై కక్షకట్టాడు. 

ఇందులో భాగంగా మాట్లాడుకుందాం రమ్మని కానిస్టుబుల్ వెంకట సుబ్బయ్య, అతని తమ్ముడు నానితో కలిసి.. రిపోర్టర్ కేశవ్ కు సమాచారం అందించారు. ఆదివారం రాత్రి కేశవ్ తన మిత్రుడు ప్రతాప్ తో కలిసి ఎన్జీవో కాలనీలో హాస్టల్ దగ్గరకు వెళ్లారు. అక్కడే ఓ గదిల ఉన్న కానిస్టేబుల్ సుబ్బయ్య వద్దకు వచ్చిన ప్రతాప్ ని బయటనే ఉండమని చెప్పాడు. కేశవ్ గదిలోకి వెళ్లగానే కొంతసేపటికి గది నుంచి కేకలు వినిపంచాయి. 

దీంతో ప్రతాప్ వెంటనే లోపలికి వెళ్లాడు. అప్పటికే కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, అతని సోదరుడు నాని ఇద్దరు పదునైన ఆయుధంతో కేశవ వీపుపై పొడిచి పోరిపోయారు. తీవ్రంగా గాయపడిన కేశవను ప్రతాప్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే కేశవ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

దర్యాప్తునకు ఆదేశించిన డీజీపీ:

నంద్యాలలో రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంత్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి సూచించారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్ తో పాటు హత్యతో ప్రమేయం ఉన్న అందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ పి.సుధీర్ కుమార్ రెడ్డిని ఆదేశించారు. 

 

Leave a Comment