Mahesh Babu Birthday: ‘సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్’ కేక పుట్టిస్తోంది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోసం సర్ ప్రైజ్ వచ్చేసింది. ఆగస్టు 9న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ వీడియో విడుదల చేశారు. ‘సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్’ పేరుతో ఈ వీడియోను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. 

ఈ వీడియోలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. అంటూ మహేష్ బాబు ఎంట్రీ ఉంటుంది. ‘ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్’ అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాక్ కేక పుట్టిస్తుంది. ‘ఇఫ్ యూ మిస్ ద ఇంట్రస్ట్.. యువిల్ గెట్ యువర్ డేట్’ అంటూ విలన్ గ్యాంగ్ కి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చాడు. 

ఇక హీరోయిన్ కీర్తి సురేష్ మహేష్ కు హారితి ఇస్తూ ‘సార్ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి’ అని చెప్పడం ఆకట్టుకుంటుంది. అప్పుడు మహేష్ బాబు ఎక్స్ ప్రెషన్స్ అబ్బో కేక..ఇక చివర్లో కీర్తి సురేష్ మల్లెపూలను చూస్తూ ‘ ఏమోయ్ కిషోర్.. ఓ ఐదారు మూరలు ఉండవవి’ అంటూ మహేష్ పంచ్ వేస్తారు. 

Leave a Comment