అత్యుత్తమ వైద్యవిధానాలపై దృష్టి : సీఎం జగన్

కుటుంబ సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించిన వారికి ముందుగా పరీక్షలు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.  కోవిడ్ నివారణపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎయిమ్స్ వైద్యలతోనూ మాట్లాడి అత్యుత్తమ వైద్య విధానాలను వైరస్ సోకిన వారికి అందించాలని సీఎం జగన్ తెలిపారు. పేషెంట్ మేనేజ్మెంట్ లో భాగంగా వివిధ దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధాలపై దృష్టి పెడుతున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 

రోజుకు 1100 నుంచి 1200 వరకు పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడించారు. ఆక్సిజన్ సప్లయికి లోటు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వైద్యులు తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు అధికారులు వెల్లడించారు.

400 బెడ్లు అందుబాటులోకి తీసుకురావాలి..

అనంతరపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కోవిడ్ -19 పేషెంట్ల కోసం కనీరం 400 బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఎన్-95 మాస్కులు కూడా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేలా ప్రయత్నాలు చేయాలని తెలిపారు. క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో శానిటేషన్ సమస్యలు ఉండకూడదని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 

 

Leave a Comment