నాగచైతన్య సినిమాకు ‘థ్యాంక్యూ’ టైటిల్

యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తరువాత పరుశురాంతో సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది. దీంతో నిందినిరెడ్డితో సినిమా చేస్తున్నాడు చైతు. అయితే  మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి మర్చిపోలేని హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో చైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ మనం తర్వాత ప్రేక్షకుల నాడి పట్టుకోలేకపోతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా..అవి ఫ్లాప్ అవుతున్నాయి. నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని విక్రమ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి మరి కొద్ది రోజుల్లో అఫీషియల్ నౌన్స్ మెంట్ రానుంది. 

Leave a Comment