‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’.. ‘మై విలేజ్ షో’ అనిల్ వెడ్డింగ్ కార్డ్ వైరల్..!

ప్రముఖ యూట్యూబర్, మై విలేజ్ షో సభ్యుడు అనిల్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇంతకు ఆ పత్రికలో ఏముందనుకుంటున్నారా.. మై విలేజ్ షో తో పాపులర్ అయిన అనిల్ మే 1న పెళ్లి చేసుకోబోతున్నాడు. కరోనా కాలంలో తాను చేసుకునే పెళ్లి సమాజానికి ఆదర్శంగా నిలవాలని భావించి ‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’ అంటూ చాలా క్రియేటివ్ గా రూపొందంచాడు. 

సాధారణంగా పెళ్లి పత్రికల్లో శ్రీరస్తు..శుభమస్తు..అవిఘ్నమస్తు అంటూ మొదలుపెడతారు. కానీ ఈ పత్రికలో మాత్రం శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అని స్టార్ చేశారు. ‘వధూవరులక కరోనా నెగిటివ్, మరువకుండా మీ ఫోన్ల 1-జీబీ డేటా ఆగపట్టుకొని పిల్లా..జెల్లా..ఐసోల్లు..ముసలోల్లు అందరూ ఫోన్ల ముందు అంతర్జాలంలో పెండ్లి సూసి ఆన్ లైన్ లో ఆశీర్వదించగలరు.. విందు.. లైవ్ లో తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వు తినుర్రి. బరాత్ ఉంది కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురుర్రి. మీరు ఎగిరిన 15 సెకన్ల వీడియో మీకు పంపుర్రి.. దాన్ని వ్లోగ్ లో పెడతాం. ఇక కట్నాలు, కానుకలు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా క్యూఆర్ స్కాన్ చేసి పంపండి’ అంటూ రూపొందించారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

Leave a Comment