అయోధ్య భూమి పూజ : తొలి ఆహ్వానం ముస్లింకే..

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజలకు ఇక రెండు రోజులే సమయంలో ఉంది. ఈ నేపథ్యంలో అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. భూమి పూజ కోసం 180 మందికి ఆహ్వానాలు పంపారు. ఇక భూమి పూజ సమయంలో ప్రధాని మోడీతో పాటు మరో నలుగురు వేదికపై వస్తారు. పీఎం మోడీ, రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహంత్ నృత్య గోపాల్ దాస్ వేదికపై ఉండనున్నారు. 

ఈ భూమి పూజ సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య సోదరబావాన్ని పెంపొందించే దిశగా బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి తొలి ఆహ్వానం అందింది. కాగా, భూమి పూజ కోసం తనను ఆహ్వానించడం పట్ల అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నదీ ఆ శ్రీరాముడి ఆకాంక్ష.. దీనిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను’ అంటూ అన్సారీ వ్యాఖ్యానించారు.  అయితే ఈ మెగా ఈవెంట్ ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని సీనియర్ బీజేపీ నేతలు ఎల్ కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ మరియు ఉమాభారతి హాజరుకావడం లేదు. 

Leave a Comment