వరుడు క్రిస్టియన్..వధువు ముస్లిం..పెళ్లి మాత్రం హిందూ సంప్రదాయంలో..

సాధారణంగా క్రైస్తవులు వారి సంప్రదాయం ప్రకారం చర్చిలో పెళ్లి చేసుకుంటారు. ముస్లింలు వారి సంప్రదాయం ప్రకారం మసీదులో నిఖా జరుపుకుంటారు. అయితే అబ్బాయి క్రిస్టియన్, అమ్మాయి ముస్లిం అయితే పెళ్లి ఏ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది? చర్చిలో లేక మసీదులో జరగాలి..కానీ ఈ పెళ్లి మాత్రం హిందూ సంప్రదాయంలో జరిగింది..

ఖమ్మం జిల్లాలోని అన్నారుగూడెంలో ఓ క్రిస్టియన్ అబ్బాయి, ఓ ముస్లిం అమ్మాయి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దిరివీ భిన్న మతాలు.. పెళ్లి ఏ సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలి? కానీ ఈ జంట తమ పెళ్లితో ఆదర్శంగా నిలవాలనుకుంది. దీంతో పెళ్లికి హిందూ సంప్రదాయాన్ని ఎంచుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.  

 

Leave a Comment