మహిళా కార్యకర్తతో బీజేపీ అధ్యక్షుడు రాసలీలలు.. !

ఓ నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి.. కానీ ఈ నాయకుడి వ్యవహారంతో బీజేపీకి తలనొప్పిగా మారంది. చివరికి అధిష్టానం ఆ నాయకుడిపై వేటు వేసింది.. బీజేపీ కరీంనగర్ అధ్యక్షుడు బాస సత్యనారాయణ ఓ మహిళా కార్యకర్తతో జరిపిన రాసలీలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అతడి బండారం బయటపడింది..

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ ఓ మహిళ కార్యకర్తను లోబర్చుకుని ఆమె రాసలీలు నడిపాడు. అతని కామ కోరికలు తీర్చుకున్నాడు. అనంతంర మోజు తీరాక వదిలించుకోవాలనుకున్నాడు. దీంతో ఆ మహిళా కార్యకర్త ఆ నాయకుడి బండారాన్ని బయటపెట్టింది. దీంతో ఆ నాయకుడు బేరాలకు దిగాడు. బేరాలు బెడిసి కొట్టాయి. చివరికి ఆ మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్న ఓ ఆడియో ఇటీవల చక్కర్లు కొట్టింది. దీంతో ఆ నాయకుడిపై విమర్శలు వెల్లువెత్తాయి. 

సత్యనారాయణ వ్యవహారంపై స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించారు. బాధ్యతగల పదవిలో ఉండి మహిళా కార్యకర్తలతో ఇలా వ్యవహరించడం పార్టీతో పాటు ఆయన వ్యక్తిత్వానికి సరైంది కాదని అసహనం వ్యక్తం చేశారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా గంగాడి క్రిష్ణారెడ్డిని నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. 

Leave a Comment