పింఛన్ డబ్బులు కొట్టేసేందుకు వాలంటీర్ భారీ స్కెచ్..!

ఏపీలో ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటిది కొందరు వాలంటీర్లు ఈ వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. గతంలో ఓ వాలంటీర్ బాలికపై అత్యాచారం చేశాడు.. మరొకరు మహిళ మెడలో గొలుసు కేట్టేశాడు. ఇంకొకడు అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టబడ్డాడు. తాజాగా ఓ వాలంటీర్ పింఛన్ డబ్బు కొట్టేసేందుకు మాస్టర్ స్కెచ్ వేశాడు. అయితే అదికాస్త విఫలమైంది..

అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీలోని శివపురంలో ఈరప్ప అనే వ్యక్తి వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. గురువారం 1వ తేదీ కావడంంతో లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడానికి తెల్లవారుజామున 4.30 గంటలకే సిద్ధమయ్యాడు. దాదాపు రూ.43,500 జేబులో పెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. 

అయితే ఆ డబ్బును ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. దీని కోసం ఓ కట్టుకథను అల్లాడు.  కొందరు దుండగులు తన కళ్లలో కారం కొట్టి పింఛన్ డబ్బును లాక్కెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడిలో తనకు తీవ్ర గాయాలయ్యాయని ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయంలో అధికారులకు అనుమానం కలిగి వీరప్పను విచారించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అతనిపై ఎలాంటి దాడి జరగలేదని, కట్టుకథ అల్లాడని తేలింది. రూ.43,500 ను వాలంటీర్ నుంచి రికవరీ చేస్తామని మున్సిపల్ కమిషనర్ నాగార్జున తెలిపారు. వాలంటీర్ వీరప్పను విధుల నుంచి తొలగించాలని మున్సిపల్ కమిషనర్ నాగార్జునకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు.    

Leave a Comment