ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయానికి.. రూ.2.5 కోట్ల భూమిని విరాళం ఇచ్చిన ముస్లిం..!

బిహార్ తూర్పు చంపారణ్ జిల్లాలోని ఖైత్వాలియా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించనున్నారు.  ‘విరాట్ రామాయన్ మందిర్’ పేరుతో ఈ దేవాలయం నిర్మాణానికి సంకల్పించారు. ఈ ఆలయ నిర్మానానికి ఓ ముస్లిం వ్యాపారీ రూ.2.5 కోట్ల విలువ చేసే భూమిని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నాడు..

విరాట్ రామాయన్ మందిర్ నిర్మాణ బాధ్యతను పట్నాలోని మహావీర్ మందిర్ ట్రసట్ స్వీకరించింది. కాగా గౌహతిలోని బిహార్ వ్యాపారి ఇస్తియక్ అహ్మద్ ఖాన్ రూ.2.5 కోట్లు విలువ చేసే భూమిని ఇచ్చినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు ఆచార్య కిషోర్ కునాల్ వెల్లడించారు. తన కుటుంబానికి చెందిన భూమిని అహ్మద్ ఖాన్ విరాళంగా ఇచ్చారని, ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్ల వ్యవహారం పూర్తయిందని కునాల్ తెలిపారు. సోదరభావానికి, మతసామరస్యానికి అహ్మద్ ఖాన్ ప్రతీకగా నిలిచారని కొనియాడారు. 

కాగా..ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం నిర్మాణానికి మహావీర్ మందిర్ ట్రస్ట్ ఇప్పటి వరకు 125 ఎకరాల భూమిని సేకరించింది. మరో 25 ఎకరాల భూమిని త్వరలోనే సేకరించనుంది. కంబోడియాలోని 12వ శతాబ్దానికి చెందిన 215 అడుగుల ఎత్తయిన అంగ్ కోర్ వాట్ కంటే విరాట్ రామాయన్ మందిర్ పెద్దగా ఉండనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం నిర్మానానికి రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 

 

Leave a Comment