పుతిన్ ను చూసి భారత్ వణుకుతోంది.. అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పై సంచలన ఆరోపణలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడును అడ్డుకోవడంలో భారత్ కాస్త వణుకుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. పుతిన్ దూకుడును అడ్డుకోవడంలో అమెరికా మిత్రదేశాల్లో చాలా వరకూ ఏకతాటిపై ఉన్నాయన్నారు. అయితే భారత్ మాత్రం ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించే విషయంలో మద్దతు తెలిపేందుకు కాస్త వణికినట్లు కనిపిస్తోందని జో బైడెన్ వ్యాఖ్యానించారు. 

నాటోలో చీలికలు తీసుకురావాలని పునిత్ భావించారని, కానీ అది నెరవేరలేదని జో బైడెన్ స్పష్టం చేశారు. నాటో ఇంత ఐకమత్యంగా ఉంటుందని పుతిన్ ఊహించలేకపోయారన్నారు. నాటోతో పాటు పసిఫిక్ లోనూ, క్వాడ్ లోనూ ఇదే ఐకమత్యం కనిపించిందని తెలిపారు. పుతిన్ దూకుడును అడ్డుకునే విషయంలో ఒక్క భారతదేశమే కాస్త బలహీనంగా ఉందన్నారు. 

రష్యా దూకుడును అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు బలంగా ఉన్నాయని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ విషయంలో ఇండియా, అమెరికా మధ్య ఉన్న భేదాభిప్రాయలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జోబైడెన్ గతనెలల తెలిపారు. అమెరికా ఆధ్వర్యంలో అంతర్జాతీయ సమాజం ఇంత ఐకమత్యంగా ఉంటుందని పుతిన్ ఊహించలేకపోయారని చెప్పారు. 

Leave a Comment