మద్యం అలవాటు ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ఇది ఒకసారి అలవాటు అయితే.. మానడం కష్టం అవుతుంది. ఈ అలవాటు మాన్పించేందుకు మందులు కూడా లేవు.. మద్యం అలవాటును మాన్పించేందుకు పరిశోధకులు చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది.. చాలా సింపుల్ టిప్ తో మద్యం అలవాటును మాన్పించవచ్చని పరిశోధకులు అంటున్నారు.. పుట్టగొడగుల కూరను తినడం వల్ల ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు.
పుట్టగొడుగుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. సైకెడెలిక్ పుట్టగొడుగులు అని పిలిచే మేజిక్ మష్రూమ్స్ తినడం వల్ల మద్యం అలవాటు నియంత్రించవచ్చని పరిశోధకులు అంటున్నారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ న్యూరో సైంటిస్టులు ఈ పరిశోధనలు నిర్వహించారు. పుట్టగొడుగుల కూరను తింటుంటే.. కొన్నాళ్లకు మద్యం తాగాలన్న కోరిక చచ్చిపోతుందట.. కొన్నాళ్లకు ఆ వాసనకే విరక్తి పుడుతుందట..
ఈ అధ్యయనానికి పరిశోధకులు మద్యం అలవాటు ఉన్న 93 మందిని ఎంపిక చేసుకున్నారు. వీరికి ప్రతిరోజూ సైలోసిబిన్ సమ్మేళనం ఉన్న మాత్రలను ఇస్తూ.. వారికి మ్యూజిక్ వినిపించారు. అలా నెలరోజు పాటు 12 సెషన్లు నిర్వహించి.. వారిని పరిశీలించారు. సైలోసిబిన్ మాత్రలు తీసుకోని వారితో పోలిస్తే.. తీసుకున్న వారిలో చాలా మార్పు వచ్చింది. 93 మందిలో 24 శాతం మంది మద్యం వదిలేశారు..
ఈ పరిశోధనలో సైలోసిబిన్ వారిలో బాగా పనిచేసినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ సైలోసిబిన్ అనేది సైకెడిలిక్ పుట్టగొడుగుల్లో అధికంగా లభ్యమవుతుంది. అందుకే మష్రూమ్స్ తినడం వల్ల మద్యం అలవాటు తగ్గే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ సిలోసిబిన్ అనేది మెదడులో ఎలా పనిచేస్తుందో మాత్రం కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు..
నోట్: ఈ అధ్యయనం కేవలం హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించి రాసినది.. ఇది వైద్యం, లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా.. వైద్యుడిని సంప్రదించండి..