గొంతులో ఆహారం ఇరుక్కొని.. ఎమ్మెల్యే కూతురు మృతి..!

ఉత్తర్ ప్రదేశ్ ప్రతాప్ గఢ్ బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కుమార్తె పూనమ్ మౌర్య అనుమానస్పదంగా మృతి చెందారు. గొంతులో ఆహారం ఇరుక్కొని ఆమె చనిపోయినట్లు పోస్టు మార్టం నివేదకలో నిర్ధారణ అయ్యింద. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

పూనమ్ మౌర్య 2017లో సంజయ్ మౌర్య అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్తతో కలిసి మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని అయోధ్య నగర్ లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి నిద్రపోయిన పూనమ్.. గురువారం ఉదయం లేవలేదు. బెడ్ పై అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు భర్త సంజయ్ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. 

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నిర్వహించారు. శ్వాసనాళంలో ఆహారం ఇరుక్కుపోవడమే ఆమె మరణానికి కారణమని వైద్యులు తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా శపరీక్షను వీడియో తీశారు. ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

 

 

Leave a Comment