కమెడియన్ ఆలీ కూతురి ఎంగేజ్మెంట్.. అల్లుడు ఏంచేస్తాడంటే?

కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఆలీ పెద్ద కూతురు ఫాతిమా రెమీజు ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఎంగేజమెంట్ వీడియోను ఆలీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

ఆలీ కూతురు ఫాతిమా ఈ మధ్యనే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం త్వరలోనే అమెరికా కూడా వెళ్లనుంది. ఈలోపు ఆమెకు పెళ్లి సంబంధం చూసి ఎంగేజ్మెంట్ చేశారు. ఆలీకి కాబోయే అల్లుడు కూడా డాక్టర్ అని తెలుస్తుంది. అంతేకాదు ఆలీ వియ్యంకుల ఇంట్లో అందరూ డాక్టర్లేనట..

ఈ ఎంగేజ్మెంట్ వీడియోను ఆలీ భార్య జుబేదా తన యూట్యబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి సన్నిహితులు సహా బ్రహ్మానందం, సాయికుమార్ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. కొంత మంది టీవీ ప్రొడ్యూసర్లు వచ్చారు. సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరూ రాలేదు. పెళ్లికి ఇండస్ట్రీ పెద్దలను పిలిచే అవకాశం ఉంది.  

 

Leave a Comment