సోనూసూద్ పై పోలీసులకు ఫిర్యాదు..!

రియల్ హీరో సోనూసూద్ పై ముంబై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా తన నివాస స్థలాన్ని హోటల్ గా మార్చారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల మేరకు ముంబైలోని జుహూ ప్రాంతంలో సోనూసూద్ కు ఆరు అంతస్తుల భవనం ఉంది. ఆ భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్ గా మార్చారంటూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు నోటీసులు పంపించారు. 

 అయినప్పటికీ సోనూసూద్ స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ భవన నిర్మాణంలో మార్పులు చేస్తూ కూడా చట్టవిరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని తెలిపింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలను సోనూసూద్ ఖండించారు. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని, కేవలం మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి మాత్రమే అనుతులు రావాలని స్పష్టం చేశారు. 

కోవిడ్ – 19 వల్ల ఎమ్సీజెడ్ఎమ్ఏ నుంచి అనమతులు ఆలస్యం అవుతుందన్నారు. ఒకవేళ అనుమతులు రాకపోతే దానిని తిరిగి నివాస సముదాయంగా మార్చేస్తానని పేర్కొన్నారు. ఈ వ్యవహరంపై పోలీసులు స్పందించారు. ప్రాథమిక విచారణ చేపట్టాకే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. 

 

Leave a Comment