రైతు అద్భుత ఆవిష్కరణ.. తన ఇంటికి కరెంట్ సృష్టించిన రైతు..!

కర్నాటకకు చెందని ఓ రైతు అద్భతం సృష్టించాడు. తన ఇంటికి అవసరమయ్యే విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన వాటర్ మిల్లును తయారు చేసుకున్నాడు. ఈ రైతు తన అద్భుత ఆవిష్కరణతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కర్నాటకలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రైతు సిద్ధప్ప. తన ఇంటి అవసరాల కోసం విద్యుత్ సరఫరా చేయాలని హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ లిమిటెడ్ ను కోరాడు. 

అయితే విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ అధికారులు నిరాకరించారు. దీంతో సిద్ధప్ప ఎలాగైనా తన ఇంటికి కరెంట్ తీసుకురావాలని అనుకున్నాడు. దీని కోసం తన గ్రామానికి సమీపంలో ఉన్న నారగండ్ కొండల పక్కనగల కెనాల్ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. 

రూ.5 వేలు ఖర్చ చేసి తన దగ్గర ఉన్న ప్లాస్టిక్ టబ్బులు, చక్రాలు ఇతర సామగ్రితో ఓ 150 వాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసే డిజైన్ రూపొందించాడు. కెనాల్ లో నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది. దీంతో తాను రూపొందించిన డిజైన్ సహాయంతో విజయవంతంగా కరెంట్ ఉత్పత్తి చేశాడు. ఇది ప్రస్తుతం 10 బల్బులు, రెండు టీవీ సెట్ లకు సరిపోయే 60 వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని సిద్ధప్ప తెలిపాడు. 

రైతు సిద్ధప్ప విషయం తెలుసుకున్న భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆశ్చర్యపోయాడు. ఆ రైతును అభినందించిన ఆయన స్టోరీని ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘సిద్ధప్ప అతి తక్కువ ఖర్చుతో, ఎవరి సాయం లేకుండానే సస్టెయినెబుల్ ప్రొడక్ట్ రూపొందించడం నమ్మశక్యంగా లేదు. ఎలాంటి వనరులు లేకుండానే గొప్ప మార్పును ఎలా తీసుకురావచ్చో చేసి చూపించాడు’ అంటూ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ లో కొనియాడారు.    

Leave a Comment