ఒకేసారి ఇద్దరితో పెళ్లి.. వీడియో వైరల్..!

పెళ్లి అనే జీవితంలో ఒకేసారి ఒకరితోనే జరుగుతుంది. అప్పుడప్పుడు అనుకోని పరిస్థితుల్లో రెండో పెళ్లి జరుగుతుంది. కానీ ఒకేసారి ఇద్దరిని ఒకే వ్యక్తి పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో అలాంటి ప్రత్యేక పెళ్లి జరిగింది. ఒక యువకుడు ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు.  

జగదల్ పుర్ పట్టణంలోని టిక్రా లోహంగా గ్రామంలో జవవరి 3న గిరిజన సంప్రదాయం ప్రకారం ఈ ప్రత్యేక వివాహం జరిగింది. ఈ పెళ్లికి ఊళ్లో వారంతా ఒప్పుకోవడంతో అందరికీ పెళ్లి కార్డులకు కూడా పంచిపెట్టారు. ఊరందరీ సమక్షంలో వరుడు చందూ మౌర్య.. హసీనా బఘేల్, సుందరి కశ్యప్ అనే ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు. 

ఇద్దరు వధువులతో ఒకేసారి ఏడడుగులు కూడా నడిచాడు. వారు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వ్యక్తి ఇద్దరిని ఒకేసారి ఎందుకు పెళ్లి చేసుకున్నాడనేదానిపై ఎవరికీ సమాచారం లేదు. 

Leave a Comment