నిశ్చితార్థం చేసుకున్న ముక్కు అవినాష్..!

బుల్లితెర కమెడియన్ ముక్కు అవినాష్ తర్వలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవల అనూజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను అవినాష్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

‘మన జీవితంలోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఆలస్యం చేయడం అవసరం లేదు. మా ఫ్యామిలీలు కలుసుకున్నాయి. తర్వాత మేము కలిశాము. చాలా మంది ఎన్నో సార్లు నా పెళ్లెప్పుడు అని అడిగారు. అతి త్వరలో నా అనూజతో పెల్లి చేసుకుంటాను. మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఓ అవినాష్ ఓ పోస్ట్ పెట్టాడు. అవినాష్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పేరు అనూజ వాకిటి అని, తన సామాజిక వర్గానికి చెందిన అమ్మాయే అని, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలసింది.. 

కాగా అవినాష్ జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. మంచి టైమింగ్ తో కామెడీ పండిస్తూ అందరి దృష్టి పడ్డాడు. కామెడీ చేయడంతో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి తన పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. 

 

Leave a Comment