పెళ్లిలో వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు.. వైరల్ వీడియో..!

గుట్కా తినడం, పొగతాగడం, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం..అయినా చాలా మంది పట్టించుకోరు. అయితే అవి తినేందుకు, తాగేందుకు కూడా ఓ సమయం ఉంటుంది. కానీ ఓ పెళ్లి కొడుకు మాత్రం ఏకంగా తన పెళ్లిలోనే గుట్కా తిన్నాడు. అంతేకాదు గుట్కా నములుతూ పూజారి చదువుతున్న మంత్రాలను చదువుతున్నాడు. అది చూసిన పెళ్లి కూతురుకు చిర్రెత్తిపోయింది.

పెళ్లిలో పూజారి మంత్రాలు చదువుతున్నాడు. ఆ సమయంలో పెళ్లి కొడుకును మంత్రాలు చెప్పాలని పూజారి అన్నాడు. పెళ్లి కొడుకు నత్తిగా నోట్లో గుట్కా నములుతూ పూజారి చెప్పిన మంత్రాలను చదువుతున్నాడు. ఇది గమనించిన పెళ్లి కూతురు ముందుగా పెళ్లి చేస్తున్న వ్యక్తిని కొట్టింది. తర్వాత  వరుడి చెంప చెళ్లుమనిపించింది. దీంతో ఆ వరుడు వెంటనే పైకి లేచి పక్కనే గుట్కాను ఉమ్మేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి కూతూరు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మంచి బుద్ధి చెప్పావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.    

Leave a Comment