ఘోరం.. 4వ అంతస్తు నుంచి కన్న బిడ్డను విసిరేసిన తల్లి..!

క్షణికావేశంలో కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. ఆడపిల్ల పుట్టిందని, పిల్లలను పోషించలేక ఇలాంటి కారణాలతో కన్న  బిడ్డల్ని చంపడానికి వెనకాడడం లేదు. ఏ తల్లి అయినా తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ తాజాగా ఓ కసాయి తల్లి మాత్రం కన్నబిడ్డను చంపేసింది. కన్నబిడ్డను నాలుగంతస్థుల భవనంపై నుంచి కింద పడేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

బెంగళూరులోని ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఓ అపార్ట్ మెంట్ డెంటిస్ట్ సుష్మా భరద్వాజ్ తన భర్తతో కలిసి ఉంటోంది.. సుష్మాకు దృతి(4) అనే కూతురు ఉంది. తన బిడ్డకు నాలుగేళ్లు వచ్చినా మాటలు రాకపోవడం, చెవులు వినబడకపోవడంతో సుష్మా మానసిక ఒత్తిడికి గురైంది. దీంతో ఎలాగైనా దృతిని వదిలించుకోవాలని భావించింది. ఓసారి రైల్వే స్టేషన్ లో వదిలేసి వచ్చింది. కానీ ఆమె భర్త స్టేషన్ కి వెళ్లి తీసుకోచ్చాడు.   

అయితే ఈసారి మాత్రం తన కూతురిని చంపేయాలని అనుకుంది.. ఈక్రమంలో శుక్రవారం అపార్ట్ మెంట్ లో నాలుగో అంతస్తు నుంచి దృతిని కిందకి విసిరేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆపై ఆమె కూడా రెయిలింగ్ ఎక్కి దూకడానికి ప్రయత్నం చేసింది. ఇది చూసిన అక్కడి వారు ఆమెను కిందకు దించారు.. సుష్మా మానసిక పరిస్థితి బాగాలేకపోవడంతోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు తెలిపారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment