ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేం.. వర్షాలకు పాత బిల్డింగ్ లు, ఇళ్లు కూలిపోతుంటాయి.. తాజాగా డ్రైనేజీ పైకప్పు కూలిపోయింది. ఓ వ్యక్తి ఒక్క క్షణం తేడాతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోడ్డు పక్కనే ఓ డ్రేనేజీ ఉంది. యమజార్ అనే వ్యక్తి లంచ్ సమయంలో డబ్బుల కోసం ఏటీఎం దగ్గరకు వెళ్తున్నాడు. రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వచ్చిన ఆ వ్యక్తి డ్రైనేజీ పైకప్పుపై కాలు వేయగానే అది షేక్ అయ్యింది. కంగారుపడిన ఆ వ్యక్తి ఇంకో అడుగు ముందుకు వేశాడు.. అంతే ఆ డ్రైనేజీ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. యమరాజ్ ముందు రావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
When Yamraj is on lunch break pic.twitter.com/zN63aFCerA
— Sagar (@sagarcasm) August 3, 2022