షాకింగ్ లవ్ స్టోరీ.. ప్రేమ కోసం హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్న యువతి..!

ప్రేమ కోసం ఓ యువతి పిచ్చిపని చేసింది. ఏకంగా హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకుంది. ఈ షాకింగ్ ఘటన అస్సాం రాష్ట్రంలో చోటుచేసుకుంది.. వివరాల ప్రకారం.. సువల్ కచీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతికి కొన్నేళ్ల క్రితం ఫేస్ బుక్ లో తన పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడు పరిచయం అయ్యాడు.. ఈ పరిచయం కాస్త స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది.. 

ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం యువతికి పిడుగు లాంటి వార్త తెలిసింది. తాను ప్రేమించిన వ్యక్తికి హెచ్ఐవి ఉందని తెలిసింది. అయినప్పటికీ అతనిపై ప్రేమను చంపుకోలేదు. హెచ్ఐవి సోకినా సరే తన జీవితం అతనితోనే అని నిర్ణయించుకుంది. మూడుసార్లు అతనితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కానీ పారిపోయిన ప్రతీసారి కుటుంబ సభ్యులు ఆమెను వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేవారు. 

ఇక ఇలా అయితే లాభం లేదనుకుంది. ప్రియుడి నుంచి ఎవరూ విడదీయకూడదని ఆ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడి హెచ్ఐవి రక్తాన్ని సిరంజీతో ఎక్కించుకుంది. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. యువతికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవి సోకినట్లు నిర్ధారణ అయింది.

 

Leave a Comment