చిన్నారిని నేలకేసి కొట్టి.. కాలుతో తొక్కి.. ఆమె అసలు మనిషేనా?

మూడేళ్ల చిన్నారికి కన్నతల్లి నరకం చూపించింది. ఏ మాత్రం కనికరం లేకుండా విచక్షణరహితంగా కొట్టింది. చిన్నారిని నేలకేసి కొట్టి, కాలుతో తొక్కి చావబాదింది. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్నా సరే కనికరం లేకుండా కొట్టింది. అయితే ఆ చిన్నారిని అంతలా కొడుతున్నా పక్కన ఉన్న వారు ఒక్కరు కూడా స్పందించకపోవడం బాధాకరం.. చాలా సేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి.. మహిళను కొట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళన స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ లో జరిగింది. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిన్నారిని కొట్టిన మహిళ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉందన్నారు. ఇంత జరుగుతున్న పక్కన ఉన్న వారు తమాషా చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరూ దీనిని అడ్డుకోకోపోవడం తనను మరింత ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment