ఈ తల్లి త్యాగానికి చేతులెత్తి మొక్కాలి.. తన మూత్రం తానే తాగి పిల్లలను కాపాడుకుంది..కానీ ఆ తల్లి మాత్రం..!

ఈప్రపంచలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. తన పిల్లల కోసం తల్లి ఎంత కష్టాన్ని అయిన భరిస్తుంది. వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతుంది. తాజాగా ఇలాంటి దక్షిణ అమెరికాలో అలాంటి త్యాగమే చేసింది ఓ తల్లి. తన పిల్లలతో సముద్రంలో చిక్కుకున్న తల్లి వారిని బతికించుకునేందుకు సాహసానికి పూనుకుంది. పిల్లలకు పాలిచ్చే శక్తి కోసం తన మూత్రాన్ని తానే తాగింది. చివరికి ఆ తల్లి మృత్యు ఒడిలోకి ఒదిగిపోయింది.. ప్రస్తుతం ఆ తల్లి గాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.. 

వివరాల మేరకు మేరీలీ చాకోన్(40).. తన భర్త, ఇద్దరు పిల్లలు, వారి ఇంటి పనులు చూసుకుంటున్న మరో మహిళతో కలిసి ట్రిప్ కి వెళ్లింది. సెప్టెంబర్ 3న వెనిజుల నుంచి టోర్టుగాకు టూరిస్ట్ క్రూజ్ బోట్ లో బయలుదేరింది. అయితే కరేబియన్ దీవులవైపు వెళ్లిన క్రూజ్ బోట్ భారీ అలల కారనంగా దెబ్బతింది. దీంతో చిన్న లైఫ్ బోట్ సాయంతో చాకోన్, తన బిడ్డలను కాపాడుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె భర్త మాత్రం నీటిలో మునిగిపోయాడు. 

ప్రమాదం జరిగాక నాలుగు రోజుల పాటు ఆ తల్లీబిడ్డలు, మరో మహిళ వెరోనికా మార్టినెజ్ లైఫ్ బోట్ లోనే ఉన్నారు. అప్పటికీ ఆహారం, నీరు లేకపోవడంతో వారి శరీరాలు డీహైడ్రేషన్ కు గురయ్యాయి. ఇక ఇద్దరు పిల్లలు(ఒకరికి రెండేళ్లు, మరొకారికి ఆరేళ్లు) పరిస్థితి చూసి తల్లి చాకోన్ చలించిపోయింది. వారిని ఎలాగైనా బతికించేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె పరిస్థితి కూడా ఏ మాత్రం బాగోలేదు. కానీ ఆమె తన పిల్లలకు పాలు ఇవ్వడం కోసం తన మూత్రాన్ని తానే తాగింది. అనంతరం పాలు ఇచ్చి వారి కడుపు నింపింది. వేడికి ఆమె ఒళ్లంతా మంటలు పుట్టాయి. అయినా ఓర్చుకుంది. తనకేమైనా పర్వాలేదు అనుకుంది. బిడ్డలను అక్కున చేర్చుకుని వేడి తగలకుండా చూసుకుంది. చివరికి డీహైడ్రేషన్ కారణంగా ఆమె ప్రాణాలు వదిలింది.

నాలుగు రోజుల తర్వాత ‘లా టార్టు’ ద్వీపం సమీపంలో ఓ చిన్నసైజు లైఫ్ బోట్ ను గుర్తించిన అధికారులు దగ్గరికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. తల్లి మృతదేహం పక్కనే ఒదిగి పడుకున్న పిల్లలను వారు రక్షించారు. మరో యువతి వెరోనికా మార్టినెజ్ పక్కనే ఓ ఐస్ బాక్స్ లో పడుకుని ప్రాణాలు కాపాడుకుంది. ప్రస్తుతం ఆమె కోలుకుంది. అయితే చాకోన్ భర్త రెమిక్ డేవిడ్ ఆచూకీ మాత్రం లభించలేదు. ట్రిప్ లో భాగంగా వెనిజులా నుంచి కరేబియన్ దీవులపై క్రూజ్ బోట్ తొమ్మిది మందితో వెళ్లింది. భారీ అలల కారణంగా మొదట పాడైన బోటు తర్వాత అలల ధాటికి చెల్లాచెదురై ఉంటుందని, సుమార 70 మైళ్ల దూరం కొట్టుకుని పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 11న మాతృమూర్తికి అంత్యక్రియలు నిర్వహించారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ తల్లి గాథ కంటతడి పెట్టిస్తోంది..     

 

 

Leave a Comment