వైరల్ వీడియో: కరెంట్ షాక్ తగిలి గిలగిల కొట్టుకున్న ఆవు.. చివరి క్షణంలో ఏమైందంటే..!

విద్యుత్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కరెంట్ పోల్స్ కు దగ్గరగా వెళ్లటం, వాటిని ఆనుకోవడం వంటివి చేయకూడదు. రోడ్డు మీద ఉండే కరెంట్ పోల్స్, ట్రాన్స్ ఫార్మర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే విద్యుత్ షాక్ గురయ్యే ప్రమాదం ఉంది. 

తాజాగా ఓ ఘటన అందరి హృదయాలను కదిలిస్తోంది. రోడ్డు మీద ఓ వ్యక్తి తన ఆవును తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో ఆవు కరెంట్ స్తంభానికి కొంత దూరంలో వెళ్లింది. సడెన్ గా ఆవుకు కరెంట్ షాక్ తగిలింది. అయితే ఆ సంఘటన జరగక ముందు కరెంట్ పోల్ ను దాటి చాలా మంది అటుగా వెళ్లారు. కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఆవుకు మాత్రం విద్యుత్ షాక్ తగిలింది.

దీంతో ఆ ఆవు గిలగిలా కొట్టుకుంది. ఆ తర్వాత యజమాని ఆవు మెడకు ఉన్న తాడును పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. అయితే తాడును పట్టుకుని లాగినా ఆ వ్యక్తికి కరెంట్ షాక్ తగలలేదు. ఆ వ్యక్తితో పాటు మరికొందరు వ్యక్తులు ఆ ఆవును పక్కకు లాగారు. తర్వాత ఆ ఆవు వెంటనే పైకి లేచింది. ఆవుకు ఏ ప్రమాదం జరకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Leave a Comment