తల్లి ధైర్య సాహసం.. కూతురి కోసం చిరుతతో పోరాడింది..!

కన్న కూతురిని కాపాడుకోవడానికి ఓ తల్లి సాహసం చేసింది. ధైర్యం చేసి చిరుతతో పోరాడింది. ఈ ఘటను మహారాష్ట్రలో చంద్రాపూర్ లో వెలుగులోకి వచ్చింది. వివరాల మేరకు.. చంద్రాపూర్ ప్రాంతంలోని దుర్గాపూర్ కాంప్లెక్స్ లో జ్యోతి పుపాల్వర్ అనే మహిథ తన మూడేళ్ల కూతురితో నివాసం ఉంటుంది. ఇంటి ఆవరణలో కూర్చుని తన కూతురికి భోజనం పెట్టిన జ్యోతి తర్వాత తన పనిలో మునిగిపోయింది. 

ఇంతలో ఓ చిరుతపులి ఇంట్లోకి చొరబడింది. చిన్నారిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ చిన్నారి కేకలు వేసింది. కూతురి కేకలు విన్న తల్లి చిరుత పులిని కర్ర తీసుకొని వెంబడించింది. ప్రాణాలకు తెగించి చిరుతో పోరాడింది. కర్రతో చిరుత మూతిపై పదేపదే కొట్టింది. దీంతో ఆ చిరుత ఆ చిన్నారిని వదిలేసి పారిపోయింది.

చిన్నారిని వదిలేసిన కూడా జ్యోతి కొంచెం దూరం చిరుతను వెంబడించింది. అయితే ఆ చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించింది. అయితే ఆ ప్రాంతంలో చిరుత దాడి చేయడం ఇదే తొలిసారి కాదు.. ఇప్పటికే ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 15 మందిని చిరుత పొట్టన పెట్టుకుందని స్థానికులు చెబుతున్నారు.   

 

Leave a Comment