‘బట్టతల’ అని ఎగతాళి చేస్తే.. అది లైంగిక వేధింపే..ట్రిబ్యునల్ తీర్పు..!

ఇటీవల కాలంలో ఎంతో మంది పురుషులను వేధిస్తున్న సమస్య బట్టతల.. గతంలో ఎప్పుడో 60 ఏళ్లు వచ్చాక వస్తున్న బట్టతల ఇప్పుడు 30 ఏళ్లకే వచ్చేస్తోంది.. వయసు తక్కువగా ఉన్న వారు సైతం బట్టతల రావడం వల్ల ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈసమస్య వల్ల అనేక మంది మానసిక ఆందోళన ఎదుర్కొంటున్నారు. 

బట్టతల ఉంటే కొందరు అదే పేరుతో పిలుస్తుంటారు.. ముఖ్యంగా పనిచేసే చోట తోటి సహద్యోగులు ‘బట్టతల’ అని వెక్కిరిస్తుంటారు. తాజాగా ఇంగ్లండ్ కు చెందిన ఓ ట్రిబ్యునల్ బట్టతలపై కీలక తీర్పు ఇచ్చింది. పనిచేసే చోట పురుషులను ‘బట్టతల’ అని పిలిస్తే లైంగిక వేధింపుల కిందకే వస్తుందని స్పష్టం చేసింది. 

వెస్ట్ యార్క్ షైర్ కేంద్రంగా పనిచేసే బ్రిటిష్ బంగ్ మాన్యుఫ్యాక్ఛరింగ్ కంపెనీ లిమిటెడ్ పై ఆ సంస్థ మాజీ ఉద్యోగి టోనీ ఫిన్ పిటిషన్ వేశాడు. కంపెనీలో సూపర్ వైజర్ తనను బట్టతల అంటూ వేధింపులకు గురిచేశాడని పేర్కొన్నాడు. ఈ కేసులో భాగంగా బట్టతలపై కామెంట్ చేయడం అవమానించడం కిందకు వస్తాయా లేదా వేధింపుల కిందకు వస్తాయా అనే అంశంపై ఎంప్లాయ్ మెంట్ ట్రిబ్యునల్ విచారణ జరిపింది. బట్టతల ఉందని అవమానిస్తే అది లైంగిక వేధింపులుగా పరిగణించాల్సి ఉందని ట్రిబ్యునల్ పేర్కొంది. 

Leave a Comment