ఈ టిఫిన్లూ ఉదయం పూట అసలు తినకండి!

సాధారణంగా ఉదయాన్నే ఏదో ఒక అల్పాహారం తీసుకోవడం మానవునికి తప్పనిసరి. కానీ అల్పాహారం కోసం ఇడ్లీలు లేదా ఉప్మాలు అంటూ మనం తీసుకునే టిఫిన్లు ఆరోగ్యకరం కాదు అని అంటున్నారు నిపుణులు. ఆయిల్ తో నిండిన బజ్జీలు, పూరీలు వంటివి తినడం వలన అనారోగ్యం పాలవుతారు అని చెబుతున్నారు. మినపప్పు గుండు పప్పు కాకుండా పొట్టు మినపప్పు తీసుకుని సగం పొట్టు ఉండేలా కడిగి ఇడ్లీ రవ్వ బదులు కొర్రలతో చేసిన ఇడ్లీలు చిరుధాన్యాల ను ఉపయోగించి అనేక రకాల టిఫిన్ లు తయారు చేసుకోవచ్చు అని చెబుతున్నారు వీటివల్ల ఉదయం మనం తీసుకునే అల్పాహారం చాలా ఆరోగ్యకరం గా ఉంటుంది .

 

ఇటువంటి ఆహార పదార్థాలు ఉదయాన్నే శరీరానికి కావలసిన అధిక శక్తి ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. సాధారణంగా మనం లేచిన వెంటనే ఒక లీటరు గోరువెచ్చని నీరు తాగాలి అది ఎంతో శ్రేయస్కరం. తర్వాత వీలైనంత పండ్లు మొలకలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇంకా వీలైతే డ్రై ఫ్రూట్స్ అంటే బాదం ,పిస్తా, వాల్ నట్స్ వంటి వాటిని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే అల్పాహారం కంటే ముందు తీసుకుంటే మీకు చక్కని ఆరోగ్యం లభిస్తుంది.

 

అలాగే మధ్యాహ్నం ఆహారంలో అన్నానికి రెండు రెట్లు కూరలు వుండే విధంగా తీసుకోవాలి. ఏ కూరగాయలు ఆకుకూరలు అయినా సరే కొంచెం తగ్గించి అన్నం కంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే మరీ మంచిది.

 

సాయంత్రం పూట మనం ఎంత అయితే ఆహారం తీసుకుంటాము అంతే మోతాదులో పండ్లను ఆహారంగా తీసుకోవడం శ్రేయస్కరం. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు వాటంతట అవే తగ్గిపోవడానికి ఆస్కారం వుంటుంది. వీటితో పాటు రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీటిని క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి. రోజుకు రెండు రకాల పండ్లు రసాలు తీసుకోవడం వాటితో పాటు కూరగాయల జ్యూస్ కూడా తీసుకోవడం చాలా మంచిది.

,

ఇక ఉదయాన్నే పుదీనా, కొత్తిమీర కలిపిన జ్యూస్ క్యారెట్, బీట్రూట్ కలిపిన జ్యూస్ కర్వేపాకు ,పాలకూర ,మునగాకు, కరివేపాకు ఇలాంటి జ్యూసులను తీసుకోవడం ఆరోగ్యానికి మరీ మంచిది. 

 

ఇక మాంసాహారం విషయానికొస్తే మీరు ఒక మూడు నెలల పాటు మాంసాహారాన్ని మర్చిపోవడం మీ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

 

లేత బీరకాయ టమోటా కలిపిన మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ కూడా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవన్నీ శరీరానికి కావలసిన పోషకాలను అందించి శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన శరీరంలో పేరుకున్న బయటకు పంపి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Leave a Comment