అద్దం గురించి ఈ నిజాలు తెలుసుకోకపోతే.. మీకు అనారోగ్య సమస్యలు తప్పవు..

ఇళ్లు నిర్మించేటప్పుడు వాస్తు ప్రకారం నిర్మిస్తారు. అంతే కాదు ఇంట్లో ఉండే ఫర్నిచర్, కిచెన్, హాల్ ఇలా ప్రతిదీ వాస్తు ప్రకారం ఉంచుకుంటారు. ఎందుకంటే వాస్తుకు ఎంతో బలముందని నమ్ముతారు. అన్ని వాస్తు ప్రకారం ఉంటే ఆనందం, మనశ్శాంతి, డబ్బు వస్తుందని నమ్మకం. అయితే మనం నిత్యం చూసే అద్దాన్ని మాత్రం ఎక్కడ పడితే అక్కడ తగిలిస్తారు. అయితే అద్దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.. వాస్తు ప్రకారం అద్దం సరైన దిశలో లేదా ఇంటి గోడకు ఉచినట్లయితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అద్దాన్ని తప్పు దిశలో ఉంచినట్లయితే దానిపై పడే చిత్రం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని వాస్తు చెబుతోంది. దీని కారణంగా ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు తరచూ అనారోగ్యం పాలవుతుంటారు.

వాస్తు ప్రకారం అద్దం ఏ దిశలో ఉంచాలి?

  • అద్దాన్ని తగిలించేటప్పుడు అది ఎక్కడ కూడా విరిగిపోకూడదు. అద్దంలో పగుళ్లు రాకూడదు. 
  • వాస్తు ప్రకారం ఇంటి గోడపై ఉన్న అద్దం చాలా కిందికి కానీ చాలా ఎత్తులో కానీ ఉండకూడదు. 
  • అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు అందాన్ని పెంపొందించాలని, సానుకూల శక్తిని ఉత్పత్తి చేయాలని కోరాలట. ఈ కారణంగా ఏదైన వాస్తు దోషం ఉంటే తొలగిపోతుందట..
  • కిటికీ లేదా తలుపు ముందు అద్దం ఎప్పుడు ఉంచకూడదు. ఎందుకంటే అది అద్దం నుంచి ఉత్పత్తి చేసిన పాజిటివ్ శక్తిని బయటకు పంపుతుంది. 
  • ఇంటి మూలలో, లైటింగ్ సరిగ్గా లేని దగ్గర అద్దం పెట్టొద్దు. 
  • మీ ఇంటి బయట టెలిఫోన్, పెద్ద చెట్టు, విద్యుత్ స్తంభం వంటివి వాస్తుదోశానికి కారణమైతే కుంభాకర అద్దం ఉంచడం ద్వారా దోశాన్ని పోగొట్టవచ్చు. 
  • అద్దం ఆగ్నేయంలో దక్షిణ గోడపై ఉంచినట్లయితే వ్యాపారంలో లాభాలు ఉంటాయి. 
  • వాస్తు ప్రకారం ఉదయం లేచిన వెంటనే అద్దం వైపు అస్సలు చూడకూడు.   

Leave a Comment