జబ్బు చేసిన బామ్మను హత్తుకుని పరామర్శించిన కోతి.. వీడియో వైరల్..!

మనుషులకు, జంతువులకు ఉండే అనుబంధం ఈనాటిది కాదు. వాటికి కాస్త ఆహారం పెట్టి చనువుతో ప్రేమ చూసుకునే వారి పట్ల అవి కృతజ్ఞతను కనబరుస్తాయి. తాజాగా ఓ కోతి తనకు ఆహారం పెట్టి ఆకలి తీర్చిన బామ్మ అనారోగ్యంతో ఉండటంతో ఆమెను ఆప్యాయంగా హత్తుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఓ బామ్మ తన ఇంటికి రోజూ వచ్చే కొండ ముచ్చు(గ్రే లంగూర్)కు తిండిపెట్టేది. ఈ మధ్య ఆ బామ్మకు జబ్బు చేసి మంచం పట్టింది. రోజూలాగే తినడానికి వచ్చిన కొండ ముచ్చు మంచం మీద ముసలావిడను చూసింది. వెంటనే మంచంపై పడుకున్న బామ్మ మీదకు ఎక్కి గుండెలను హత్తుకుని పరామర్శించింది. ఆమె గుండెల మీద పడుకుని ఆమె కోసం పడిన తపన ఎంతో మందిని కదిలించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

Leave a Comment