హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత అరుదైన రికార్డు..!

హీరో విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత అరుదైన రికార్డు సాధించింది. ఇటీవల హోపర్ డాట్ కం ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆశ్రిత చోటు దక్కించుకుంది. భారతీయులు అత్యల్పంగా ఉండే ఇన్ స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ జాబితాలో ఆమె చోటు దక్కించుకోవడం విశేషం..

ఇన్ స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, నటి ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ఈ లిస్ట్ లో ఆశ్రిత ప్రపంచ వ్యాప్తంగా 377వ స్థానంలో నిలవగా, ఆసియా మొత్తంలో 27వ ర్యాంకులో ఉంది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో వీడియోకు సమారు 400 డాలర్లు తీసుకుంటుంది. 

కాగా ఆశ్రితకు కుకింగ్ అంటే చాలా ఇష్టం.. దీంతో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి అందులో తాను చేసే రకరకాల వంటకాల వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 13 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆశ్రిత 2019లో వినాయక రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు స్పెయిన్ లోని బార్సిలోనాలో స్థిరపడ్డారు. 

Leave a Comment