పామును మెడకు చుట్టుకుని సైకిల్ పై తిరిగిన వృద్ధుడు.. వీడియో వైరల్..!

పామును చూస్తేనే భయంతో వణికిపోతారు చాలా మంది.. కానీ ఈ వృద్ధుడు మాత్రం పామును తన మెడకు చుట్టుకుని సైకిల్ పై ఊరంతా చక్కర్లు కొట్టాడు. ఇది చూసిన వారందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. 

కర్ణాటకలోని బెళగావి జిల్లా హంగరగా గ్రామంలో ఆదివారం ఓ వృద్ధుడి ఇంట్లోకి పాము(జెర్రిపోతు) చొరబడింది. అయితే ఆ వృద్ధుడు ఏమాత్రం చలించకుండా పామును పట్టుకుని తన మెడకు చుట్టుకున్నాడు. పామును మెడకు చుట్టుకుని సైకిల్ మీద గ్రామంలో సంచరించాడు. తర్వాత పామును దూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ వీడియోను అటుగా బైక్ పై వెళ్తున్న యువకుడు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. 

Leave a Comment