మౌలానా సాద్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు

భారత దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు కావడానికి కారణమైన ఇస్లామిక్ గ్రూప్ తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంధల్విపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని మర్కజ్ లో గత నెలలో సమావేశాన్ని నిర్వహించినందుకు ఆయనపై హత్యాయత్నం చేసినట్లు ఢిల్లీ  పోలీసులు ఆరోపించారు.

అయితే గత కొన్ని రోజులుగా తబ్లిగీ జమాత్ మరియు దాని కార్యలయం యొక్క ఆర్థిక లావాదేవీలపై ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. బ్యాంకులు మరియు ఆర్థిక ఇంటెలిజెన్స్ సేకరణ సంస్థల నుంచి వివిధ ప్రతాలను పొందినట్లు అధికారులు తెిలిపారు. దేశ విదేశాల నుంచి సంస్థకు విరాళాలు కూడా అందినట్లు ఏజెన్సీ పరిశీలనలో ఉన్నాయని అధికారులు తెలిపారు. 

స్వీయ నిర్బంధంలో  ఉన్న మౌలానా సాద్ కు ఈడీ త్వరలో సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. క్వారంటైన్ ముగిసిన తర్వాత ఆయనపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 

 

Leave a Comment