ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లేనట్టే..!

కరోనా వైరస్ కారణంగా రాబోయే T20 World Cup ను వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ Simon Katich తెలిపారు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహిళల T20 World Cup తోపాటే ఈ టోర్నమెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని  IPL ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ అభిప్రాయపడ్డారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లో ఆరంభం కావాల్సిన టీ20 వరల్డ్ కప్ జరిగే అవకాశాలు లేవన్నారు.

అయితే ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా..లేదా అనే దానిపై ఐసీసీ స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మెగా టోర్నీని వచ్చే ఏడాది సమ్మర్ లో నిర్వహించేందుకు ముందస్తుగా సన్నద్ధం కావాలన్నాడు. 

కరోనా వైరస్ ప్రభావం కారణంగా పెద్ద పెద్ద టోర్నమెంట్లు రద్దు అవుతున్నాయి. ఫ్యూచర్ టోర్నమెంట్ ప్రోగ్రామ్ గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి వింటే అది ఎందవరకూ సాధ్యపడుతుందనే అనుమానం వ్యక్తమవుతుందన్నాడు. అయితే T20 World Cup షెడ్యూల్ ను మార్చాలని ఇప్పటి వరకు ఎవరూ అడగలేేదని ఐసీసీ స్పష్టం చేసింది. 

Leave a Comment