పబ్ లో దెయ్యం..వీడియో వైరల్..!

యూకేలోని ఓ పబ్ లో దెయ్యం వీడియో కలకలం రేపుతోంది. ఓ దెయ్యం ఏకంగా పబ్ కు వస్తుంది. పైగా తాను పబ్ కి వచ్చానని అందరి తెలిసేందుకు రకరకాల విన్యాసాలు చేస్తోంది. కుర్చీ కదిలించడం, చాక్ బోర్డు కదిలించడం చేస్తోంది. ఈ ఈ వింత ఘటన కార్డిఫ్ లోని ది లాన్స్ డౌన్ పబ్ లో జరిగింది. ప్రస్తుతం ఈ దెయ్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఏం జరిగిందంటే.. ఈ ఏడాది జులై 26న సాయంత్రం ఓ మహిళ పబ్ కి వెళ్లి అక్కడ ఓ టేబుల్ మీద కూర్చుంది. అక్కడ నాలుగు కుర్చీలున్నాయి. వాటిలో ఒక కుర్చీలో ఆమె కూర్చుంది. మిగితావి ఖాళీగా ఉన్నాయి. ఆర్డర్ ఇచ్చి వేచి చూస్తూ.. తన మొబైల్ ఫోన్ చూస్తుంది. అంతలో ఆమెకు ఎదురుగా ఉన్న ఓ కుర్చీ సడెన్ గా కదిలింది. ఇది చూసిన ఆ మహిళ టేబుల్ కింద చెక్ చేసింది. కానీ ఏమీ కనిపించలేదు. దీంతో వెంటనే ఈ విషయాన్ని మేనేజర్ కు చెప్పింది. సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే.. కుర్చీ దానంతట అదే కదిలింది. ఇది చూసి ఆమె షాక్ అయింది. 

అంతేకాదు పబ్ లోని ఉద్యోగులకు కూడా ఇలాంటి అనుభవాలు అవుతుంటాయట. పబ్ లో చేరిన మొదట్లో ఓ రోజు చాక్ బోర్డు ఉన్నట్లుండి ఊగిందని, అది చూసి చాలా భయపడ్డానని పబ్ లో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి చెప్పింది. అయితే ఆ దెయ్యం తమను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని, కేవలం తన ఉనికిని గుర్తించాలనే ఇలా చేస్తుందని తెలిపింది. తమకు ఇది అలవాటైందని చెప్పింది. ఇలాంటి సంఘటనలు జరగడం ఇక్కడ సాధారణమే అని పబ్ మేనేజర్ చెప్పాడు. పబ్ టైమింగ్స్ పూర్తయ్యాక తాను బయట కూర్చుని పని చేసుకుంటుంటే ఫర్నిచర్ కదిలిస్తున్నట్లు సౌండ్స్ వచ్చేవని, వెళ్లి చూస్తే శబ్దాలు ఆగిపోయేవని మేనేజర్ తెలిపాడు.  

Leave a Comment