‘రూ.1000 లేక నా భార్య చనిపోయింది’.. మొగులయ్య చెప్పింది వింటే కన్నీళ్లు వస్తాయి..!

కిన్నెర కళాకారుడు మొగులయ్య.. ఈ పేరు ఇంతవరకు చాలా మందికి తెలియదు. కానీ ఇటీవల విడుదలైన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ పాడటంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాటతో ఆయన పేరు ఒక్కసారిగా మోర్మోగింది. భారీస్థాయిలో పాపులారిటీ వచ్చింది. తాజాగా పవన్ కళ్యాణ్ మొగులయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. మొగులయ్యను వ్యక్తిగతంగా కలుసుకుని రూ.2 లక్షల చెక్కును అందజేశారు. 

అయితే ఇప్పుడు ఇంత పాపులారిటీ వస్తున్న మొగులయ్య జీవితం అంతా కష్టాలమయం. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాకు మొగులయ్య ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్ల్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చారు. ‘నేను చాలా బీద పరిస్థితిలో ఉన్నాను. ఒక్క రూ.1000 లేక నా భార్య చనిపోయింది. భార్య చనిపోయినాక కూడా రూపాయికి గతి లేదు. కె.వి.రమణాచారి రూ.10 వేలు సహాయం చేశారు. తిండి లేక నా భార్యకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. 

నాకు ఎలాంటి చెడు వ్యసనాలు లేవు. కల్లు, సిగరెట్టు, మందు తాగను. నా కొడుక్కి అనారోగ్యం వస్తే రూ.5 లక్షలు ఖర్చయింది. రూ.2 లక్షలు రమణాచారి ఇచ్చారు. మిగితా డబ్బులు కట్టమంటే నాదగ్గర లేవని డాక్టర్ కాళ్లు పట్టుకున్నా..రేషన్ బియ్యం తింటూ జీవనం సాగిస్తున్నాము. శ్రీనివాస గౌడ్ సార్ ఇళ్లు విషయంలో సాయం చేస్తానని చెప్పారు. నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. నా వయస్సు ఇప్పుడు 68 సంవత్సరాలు. ఇప్పుడు నాకు పని చేయడం చేతకావట్లేదు.’ అంటూ మొగులయ్యా చెప్పుకొచ్చారు.  

Leave a Comment