చిరంజీవికి మోహన్ బాబు బర్త్ డే గిఫ్ట్..!

మెగాస్టార్ చిరంజీవి శనివారం తన 65వ పుట్టిన రోజును జరుపుకున్నారు. చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని డైలాగ్ కింగ్ మోహన్ బాబు తన ఆప్తమిత్రుడికి ఒక కానుక పంపారు.  చెక్కతో చేసిన ఓ బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. హార్లీ డేవిడ్ సన్ లాగా ఉన్న బైక్ దగ్గర నిలుచుని చిరంజీవి ఫొటో కూడా దిగారు. 

ఆ గిఫ్ట్ ను చిరంజీవి ట్విటర్ లో షేర్ చేశారు..‘ నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజు నాడు, ఒక కళాకృతిని కానుకగా పంపారు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. నీ బహుమానానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. 

Leave a Comment