సంకల్పం ఉంటే సమస్యలు ఓ లెక్కా?

సంకల్పం ఉంటే ఎంత కష్టమైన సాధించవచ్చు..మహారాష్ట్రలోని సింధూదుర్గ్ జిల్లా కంకవ్లి తాలూకాలోని డారిస్టే గ్రామానికి చెందిన స్వప్నాలి 12వ తరగతిలో 98 శాతం మార్కులు సాధించింది. ఆమెకు వెటర్నరీ డాక్టర్ కావాలని ఆకాంక్ష ఉంది. దీంతో ఆమె ఎంట్రన్ ఎగ్జామ్ కోసం  గోరెగావ్ లోని ముంబై వెటర్నరీ కాలేజీ యొక్క ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతుంది. అయితే ఆమె మారుమూల గ్రామంలో నివసిస్తుందున ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. అది ఆమె చదువుకు అడ్డంకిగా మారింది.

ఆమె కష్టాన్ని చూడలేక ఆమె సోదరులు ఒక కొండపై ఇంటర్నెట్ సిగ్నల్ ఉన్న చోట ఒక షెడ్ ను నిర్మించారు. ఆ షెడ్ లో కూర్చొని ఆమె ఆన్ లైన్ పాఠాలు వింటుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆ షెడ్ లో చదువుతోంది. తన కలలకు ఏవీ అడ్డంకి కాలేవని తన పట్టుదలతో నిరూపించింది. ఆ కొండ ఆమె ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది.   

Leave a Comment