రెండో దశలో కరోనా వ్యాక్సిన్ వేసుకోనున్న  ప్రధాని మోడీ..!

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. జనవరి 16వ తేదీ నుంచి తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లు సహా ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకాలు వేస్తున్నారు. కాగా, ప్రధాని మోడీ వ్యాక్సిన్ తీసుకోవాలని వ్యాక్సినేషన్ ప్రారంభానికి ముందు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. 

రెండో దశ వ్యాక్సినేషన్ లో 50 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించనున్నారు. ఈ రెండో దశలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రుల సమావేశంలో మోడీ 50 ఏళ్లు పైబడిన నేతలంతా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించిన తొలి రోజే ప్రధాని మోడీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా వ్యాక్సిన్ అందించనున్నారు. 

  

 

Leave a Comment