ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఈనెల 8న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 

కరోనా టీకా పంపిణీ వల్ల ఎన్నికలు ఇప్పుడే నిర్వహించలేమని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈనెల 11న ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టేశారు. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై ఎస్ఈసీ అప్పీల్ కు వెళ్లారు. హైకోర్టు ధర్మాసనం మూడు రోజుల పాటు ఇరుపక్షాల వాదనలను వినింది. ఆ తర్వాత ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని వెల్లడించింది.  

సుప్రీం కోర్టుకు ప్రభుత్వం..

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లనుంది. స్వార్థ ప్రయోజనాలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుకెళ్తున్నారని, పదవీ కాలం ముగిసేలోగా ఎన్నికలు జరపాలనే పట్టుదలతో ఉన్నారని ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. కరోనా వేళ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. 

 

Leave a Comment