రేషన్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్..!

ఇంటింటికీ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాల పంపిణీకి ఉద్దేశించిన 9260 మొబైల్ వాహనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ బెంజిసర్కిల్లో గురువారం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2500 వాహనాలకు ఆయన పచ్చజెండా ఊపారు. వీటితోపాటు నార సంచులను ఆయన ఆవిష్కరించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంలో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన పేద, నిరుపేద కులాలకు చెందిన 9260 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రూ. 539 కోట్ల వ్యయంతో 9260 వాహనాలను సమకూర్చడం జరిగింది. ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 830 కోట్ల మేర అదనపు ఖర్చును కూడా భరిస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నారు. 

 

Leave a Comment