ప్రపంచంలోనే అతిపొడవైన అటల్ టన్నెల్ ను ప్రారంభించిని మోడీ..

ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ భారత దేశంలో ప్రారంభమైంది. శనివారం భారత ప్రధాని నరేంద్ర మోడీ అటల్ టన్నెల్ ను ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తంగ్ లో నిర్మించిన అటల్ టన్నెల్ ను 2002 మే 26న అప్పటి ప్రధాని వాజ్ పేయి శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల సాధ్యం కాలేదు. 20 ఏళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఈ సొరంగ మార్గం ద్వారా భద్రతా దళాలు వేగంగా సరిహద్దులకు చేరుకోవడానికి ఎంతో కీలకం కానుంది. 

అటల్ టన్నెల్ యొక్క ప్రత్యేకతలు..

  • దాదాపు రూ.3,500 కోట్ల వ్యయంతో ఆస్ట్రియా టన్నెలింగ్ విధానంలో దీన్ని నిర్మించారు.
  • ఈ టన్నెల్ పొడవు 9.02 కిలోమీటర్లు ఉంటుంది. 
  • హిమాలయాల్లోని పిర్ పంజాల్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో నిర్మించారు.
  • ఈ టన్నెల్ ద్వరా మనాలీ-లేహ్ ల మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో పాటు 4-5 గంటల సమయం ఆదా అవుతుంది. 
  • ఈ టన్నెల్ దక్షిణ ద్వారం మనాలీ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3,060 మీటర్ల ఎత్తులో, ఉత్తర ద్వారం లాహౌల్ లోని తేలింగ్ సిస్సు గ్రామ సమీపంలో సముద్ర మట్టానికి 3,071 మీటర్ల ఎత్తులో ఉంది.
  • ఈ సొరంగ మార్గం వల్ల శీతాకాలంతో పాటు అన్ని కాలాల్లో ఏడాది పొడవునా ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు ఉంటుంది.
  • గంటలకు 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించవచ్చు. రోజుకు 3 వేల కార్లు, 1500 ట్రక్కులు ప్రయాణించేందుకు అవకాశం ఉంది. 
  • ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యం ఉండగా, ప్రతి 60 మీటర్లకు మంటలను అదుపుచేసే అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు.
  • 250 మీటర్లకు ఆటో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టంతో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. 
  • ప్రతి 25 మీటర్లకు సొరంగ మార్గం నుంచి బయటికి వెళ్లేందుకు దారి చూపే సూచీలు, లైటింగ్ వ్యవస్థ ఉంది. టన్నెల్ లో వెలుతురు కోసం సెమీ ట్రాన్స్ ఫర్ వెంటిలేషన్ సిస్టం ఏర్పాటు చేశారు. 

Leave a Comment