కేరళ యువతి సంచలనం.. 3 నెలల్లో 350 కోర్సులు పూర్తి..

కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చాలా మంది కొత్త కొత్త ప్రయోగాలుచేస్తూ టైమ్ పాస్ చేశారు. మరి కొందరు కొత్త, పాత సినిమాలన్నీ చూశారు. కానీ కేరళకు చెందిన ఓ యువతి మాత్రం లాక్ డౌన్ సమయాల్ని ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. ప్రపంచంలోని పలు యూనివర్సీటీలు అందించే ఆన్ లైన్ కోర్సులకు అడ్మిషన్లు తీసుకుని 3 నెలల్లో 350 కోర్సులు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించింది..

కేరళలోని కొచ్చీలో ఎలమక్కర ప్రాంతానికి చెందిన ఆరతి రఘునాథ్ తనకు దొరికిన ఖాళీ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంది. ఈమె స్థానిక ఎంఈఎస్ కాలేజీలో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. లాక్ డౌన్ సమయాన్ని వృధా చేయకూడదని భావించిన ఆరతి coursera వెబ్ సైట్ నుంచి జాన్ హాకిన్స్ యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్, వర్జీనియా విశ్వ విద్యాలయం, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ, కోపెన్ హాగన్ విశ్వవిద్యాలయం, రోచెస్టర్ యూనివర్సిటీ, ఎమోరీ విశ్వవిద్యాలయం, కోర్సెరా ప్రాజెక్ట్ నెట్ వర్క్ అందించిన ఆన్ లైన్ కోర్సులకు అడ్మిషన్లు తీసుకుని పూర్తి చేసింది. ఇలా 90 రోజుల్లో 350 కోర్సులు పూర్తి చేసి రికార్డు నమోదు చేసింది. 

 

Leave a Comment