1998-డీఎస్సీకి ఎంపికైన ఎమ్మెల్యే ధర్మశ్రీ..!

1998 డిఎస్సీ అర్హులకు కాంట్రాక్టు ఉద్యోగాల కల్పనకు సీఎం జగన్ అమోదించిన సంగతి తెలిసిందే.. 1998 డిఎస్పీలో ఉపాధ్యాయ నియామకాల కోసం అర్హత సాధించి, ఉద్యోగాలు దక్కని అభ్యర్ధులు దాదాపు పాతికేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారిపోతున్నా వారి తలరాతలు మాత్రం మారలేదు. ఈ నేపథ్యంలో 1998 డిఎస్సీ అర్హులకు మినిమం టైమ్‌ స్కేల్ అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అమోదం తెలిపింది. దాదాపు 4వేలమంది అభ్యర్ధులకు ఊరటనిచ్చే దస్త్రంపై సీఎం సంతకం చేశారు.

తాజాగా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితాలో అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. 1998 డీఎస్సీలో ఆయన ఎంపికయ్యారు.  ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. 1998 డీఎస్సీలో అర్హత సాధించాన్నారు. ఆ డీఎస్సీ పెండింగ్ లో పడింది. ఆసమయంలో రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో పనిచేశాను. 

ఈ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరునిగా ముందుకు సాగాని, ఇప్పుడు వైఎస్సార్సీపీలో సముచిత స్థానంలో ఉన్నాని అన్నారు. అప్పుడే ఉద్యోగం వస్తే రాజకీయాల కంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చేవాడినని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్‌ కి డీఎస్సీ 1998 బ్యాచ్‌ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. 

 

Leave a Comment