విమానం ఇంజిన్ లో మంటలు.. 185 మంది ప్రాణాలు కాపాడింది..!

నేడు ప్రపంచంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆర్మీతో పాటు వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. డ్రైవింగ్ చేయడం ఆడవాళ్ల వల్లకాదు అని అనుకున్న వారికి.. నేటి మహిళలు హెలికాప్టర్లు, విమానాలు నడుపుతూ అది తప్పని నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో కెప్టెన్ మోనికా ఖన్నా కూడా ఒకరు.. 185 మంది ప్రాణాలను కాపాడి మోనికా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

ఏం జరిగిందంటే?

ఆదివారం పాట్నా నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని పక్షి ఢీకొనడంతో ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఈ విమానంలో 185 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మంటలు విమానంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో వెంటనే ఇంజిన్ ని ఆఫ్ చేసింది. ఎవరూ భయాందోళనలకు గురికావద్దని, ధైర్యంగా ఉండాలని సిబ్బందితో ప్రయాణికులకు చెప్పించింది.  ఆ సమయంలో మోనికా ఎంతో చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. దీంతో విమానంలోని 185 మంది ప్రాణాలను కాపాడింది. దీంతో మోనికాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

కెప్టెన్ మోనికా ఖన్న ఎవరు?

మోనికా ఖన్న స్పైస్ జెట్ లిమిటెడ్ లో పైలట్.. ఇటీవల బోయింగ్ 737కి కెప్టెన్ ఇన్ కమాండ్ గా బాధ్యతలు తీసుకుంది. ఆమెది పంజాబ్ రాష్ట్రం.. ఎంబీఏ చదివింది. ఆమెకు పర్యటనలు, ఆకాశ యానాలు అంటే అమితమైన ఇష్టం.. అందుకే పైలట్ కెరియర్ ను ఎంచుకుంది. శిక్షణలో ఉన్నప్పుడే ధైర్యసాహసాలున్న యువతిగా పేరు తెచ్చుకుంది.  

Leave a Comment